Logo
Download our app
బోధన్ లయన్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు
NEWS   Mar 09,2025 11:27 am
బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. కొత్తగా నెలకొల్పిన వాటర్ ప్లాంట్ కు ప్రారంభోత్సవం చేశారు. నూతనంగా నిర్మించదల్చిన లయన్స్ జనరల్ హాస్పిటల్ కంటి ఆసుపత్రి పక్కనే అందుబాటులో గల స్థలాన్ని పరిశీలన జరిపారు. అధునాతన సదుపాయాలతో కూడిన మొబైల్ ఐ స్క్రీనింగ్ వ్యాన్ ను సందర్శించారు. వైద్య సేవలపై అరా తీసి తెల్సుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source