Logo
Download our app
వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
NEWS   Mar 09,2025 11:28 am
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్‌ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్‌ నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన నలుగురు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వివిధ పోలీస్‌స్టేషన్లలో సుమారు 40 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ముఠా సభ్యులను శనివారం నిజామాబాద్‌ నగరంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source