Logo
Download our app
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ జ‌రిగే వ‌ర‌కు ప‌రీక్ష‌లు వ‌ద్దు
NEWS   Mar 09,2025 09:29 am
ఎంఆర్పీఎస్ అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తిగా జరిగే వరకు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను నిలిపి వేయాలని కోరారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అందులో చట్టం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మళ్లీ గ్రూప్ 1 ,గ్రూప్ 2 , గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్ర‌క‌ట‌న చేయ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. రిజ‌ల్ట్స్ ప్ర‌క‌టిస్తే త‌మ జాతికి చెందిన అభ్య‌ర్థులు తీవ్రంగా న‌ష్ట పోతార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source