ఉచ్చులో పడిన హనీ బ్యాడ్జర్
NEWS Mar 08,2025 03:48 pm
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలెం ప్రాజెక్టు సమీపంలోని గుట్టల పైన అటవి ప్రాంతంలో జంతువుల వేట కోసం అమర్చిన ఉచ్చులో ఒక వింత జంతువు చిక్కుకుందని తెలుసుకున్నారు. అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి చూడగా ఉచ్చులో చిక్కుకున్న జంతువుని హానిబ్యాడ్జర్ గా గుర్తించారు. ఉచ్చు తొలగించి అటవీ ప్రాంతంలోకి దానిని వదిలి వేశారు.