Logo
Download our app
తెలంగాణ దేశానికి రోల్ మాడ‌ల్
NEWS   Mar 08,2025 10:14 am
తెలంగాణ‌ దేశానికి రోల్ మోడ‌ల్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గుజ‌రాత్ మోడ‌ల్ ను ఎవ‌రూ స్వీక‌రించ‌డం లేద‌న్నారు. ప్ర‌ధాని మోదీకి త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌చారం మీద ఉన్నంత ధ్యాస దేశం ప‌ట్ల లేద‌న్నారు. ఢిల్లీలో ఇండియా టుడే ఎన్ క్లేవ్ లో పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌జ‌లు ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల గురించి ఆలోచిస్తున్నార‌ని చెప్పారు. హైద‌రాబాద్ ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, రియ‌ల్ ఎస్టేట్ కు కేరాఫ్ గా ఉంద‌న్నారు. కేసీఆర్ ఒక్క‌రి వ‌ల్ల తెలంగాణ అభివృద్ది చెంద‌లేద‌న్నారు. గ‌తంలో చిన్నారెడ్డి, వైఎస్ఆర్, చంద్ర‌బాబు నాయుడు వ‌ల్ల అభివృద్ది జ‌రిగింద‌న్నారు. దానిని నేను ప్ర‌స్తుతం తీసుకు పోయేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source