Logo
Download our app
15న శ్రీ‌నివాస క‌ళ్యాణోత్స‌వం
NEWS   Mar 08,2025 09:32 am
అమరావతిలోని శ్రీవారి ఆలయంలో మార్చి 15న శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు. శ్రీనివాస కళ్యాణం సందర్భంగా ఆయన టీటీడీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్ర‌బాబు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌య నిర్మాణానికి 25 ఎక‌రాల స్థ‌లాన్ని 2019లో శంకుస్థాప‌న చేశార‌ని తెలిపారు. 2022లో ఈ ఆల‌యం అందుబాటులోకి వ‌చ్చిందన్నారు. శ్రీవారి వైభవాన్ని నాలుగు దిశల వ్యాప్తి చేసేందుకు టీటీడీ శ్రీవారి కళ్యాణం ఉపయోగ పడుతుందని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source