Logo
Download our app
గ్రామాలు సందర్శించిన వ్యవసాయ అధికారి
NEWS   Mar 07,2025 11:15 pm
కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాలలో జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ పర్యటించారు. నమిలకొండ గ్రామంలో ఏఈఓలు చేస్తున్న డిజిటల్ క్రాప్ సర్వేని పరిశీలించారు. పూడూరులోని పలు వరి పొలాలను పరిశీలించి వరిలో అగ్గి తెగులు ఉదృతి ఎక్కువగా ఉందని గమనించి ప‌రిష్కార‌ పద్ధతులు వివరించారు. పూడూరు సొసైటీలో యూరియా అమ్మకం, నిల్వ పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారి జ్యోతి, ఏఈఓ రాజేష్, సొసైటీ సీఈఓ రాజేందర్, అభ్యుదయ రైతులు రాంరెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source