చేనేత సొసైటీల అవకతవలపై విచారణ
NEWS Mar 07,2025 03:13 pm
అనంతపురం జిల్లాలోని చేనేత సహకార సంఘాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై ప్రభుత్వం విచారణ చేపట్టిందని మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేనేతల అభివృద్ధికి 2014-19 నాటి పథకాలను మరోసారి అమలు చేయనున్నట్లు తెలిపారు. నేషనల్ రూరల్ లైవ్లీ మిషన్ లో భాగంగా సెర్ప్ ఆధ్వర్యంలో రూ.120 కోట్లతో నేతన్నలకు పని కల్పించడంతో పాటు ఆర్థికాభివృద్ధిని కల్పించనున్నామన్నారు. ఎన్ఎచ్డీసీ పథకం ద్వారా 15 శాతం సబ్సిడీతో నూలు సరఫరా చేస్తున్నామన్నారు. 50 ఏళ్లు నిండిన చేనేతలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచి పెన్షన్లు ఇస్తున్నామన్నారు.