Logo
Download our app
ఉచిత బ‌స్సు ప్ర‌యాణం హుళ‌క్కేనా..?
NEWS   Mar 07,2025 01:26 pm
కూట‌మి స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌. కొలువు తీరి నెల‌లు గ‌డుస్తున్నా ఇచ్చిన హామీల ఊసెత్త‌డం లేదంటూ మండిప‌డ్డారు. మ‌హిళ‌ల‌కు ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని చెప్పార‌ని, ఇప్పుడు దాని గురించి మాట్లాడ‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఎన్నిక‌లప్పుడు మ‌హిళ‌లను ల‌క్ష‌లాధికారుల‌ను చేస్తామ‌ని న‌మ్మించార‌ని, తీరా గెలిచాక వారి గురించి ప‌ట్టించు కోవ‌డం మానేశారంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు కండీష‌న్స్ అప్లై అంటూ కొత్త రాగం ఎత్తుకోవ‌డం ప‌ట్ల సీరియ‌స్ అయ్యారు .
⚠️ You are not allowed to copy content or view source