Logo
Download our app
మాజీ మంత్రి పేర్ని నానికి బెయిల్ మంజూరు
NEWS   Mar 07,2025 07:33 am
మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ రిలీఫ్ ల‌భించింది. రేష‌న్ బియ్యం మిస్సింగ్ కేసులో ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు త‌న‌ను ఎ6గా చేర్చారు. త‌న‌ను అరెస్ట్ చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించారు పేర్ని నాని. ఇవాళ విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. కూట‌మి ప్ర‌భుత్వం కావాల‌ని క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. త‌న‌ను ఇబ్బంది పెట్టేందుకు అక్ర‌మ కేసు బ‌నాయించింద‌ని అన్నారు. బియ్యం ఎవ‌రు మెక్కుతున్నారో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source