పోగొట్టుకున్న ఫోన్ ఎస్సై అందజేత
NEWS Mar 06,2025 06:13 pm
ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలోని పౌల్ట్రీ ఫారంలో పనిచేసే మహమ్మద్ అత్తర్ గత నెలలో తన ఫోన్ పోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే CEIR Portal లో వివరాలను నమోదు చేసి బాధితుడు పోగొట్టుకున్న ఫోనును ట్రేస్ అవుట్ చేసి గురువారం బాధితుడికి అందజేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. ఎవరైనా ఫోను పోగొట్టుకుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.