Logo
Download our app
8న జాతీయ లోక్ అదాలత్
NEWS   Mar 07,2025 08:22 am
ఈ నెల 8న నిజామాబాద్ నగరంలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సునీత కుంచాల సూచించారు. కొంత కాలంగా కోర్టులో కేసులు నడుస్తున్న బాధితులకు సత్వరమే పరిష్కార మార్గాన్ని చూపేందుకు లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు జడ్జి తెలిపారు. పోక్సో కేసులు, హత్య కేసులు, ఇతరత్రా కేసుల్లో బాధితులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవచ్చన్నారు. వివిధ హత్య కేసులో తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు ఆర్థికంగా బాసటగా నిలుస్తున్నట్లు తెలిపారు .
⚠️ You are not allowed to copy content or view source