Logo
Download our app
చంద్ర‌బాబుపై సానియా మీర్జా ప్ర‌శంస‌
NEWS   Mar 06,2025 09:20 pm
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌లు కురిపించారు. 25 ఏళ్ళ క్రిందటే క్రీడలకు ప్రాముఖ్యత ఇచ్చారని పేర్కొన్నారు. 2000 సంవ‌త్స‌ర కాలంలో జాతీయ క్రీడ‌ల‌ను నిర్వ‌హించార‌ని, చాలా మంద్రి క్రీడాకారుల‌కు ప్రోత్సాహం క‌ల్పించార‌ని అన్నారు. జాతీయ మీడియా రిప‌బ్లిక్ ఛాన‌ల్ ప్లీన‌రీ స‌మ్మిట్ 2025లో సానియా మీర్జా పాల్గొని ప్ర‌సంగించారు. అద్భుత‌మైన నాయ‌క‌త్వ ప్ర‌తిభ క‌లిగిన నాయ‌కుడంటూ చంద్ర‌బాబును ఆకాశానికి ఎత్తేశారు.
⚠️ You are not allowed to copy content or view source