బీసీ రిజర్వేషన్ చట్టం వచ్చాకే ఎలక్షన్స్
NEWS Mar 06,2025 05:52 pm
మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ చట్టం వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళతామని ప్రకటించారు. అంత దాకా ఎన్నికలంటూ ఉండవని పరోక్షంగా వెల్లడించారు. బలహీన వర్గాలకు సంబంధించి తమ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లో ఇంకొందరు తమ పేర్లు నమోదు చేసుకోలేదని పొడిగించడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా కులగణన జరగలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఏమిటో దీని ద్వారా తెలిసిందన్నారు.