Logo
Download our app
తెలంగాణ‌లో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్
NEWS   Mar 06,2025 08:42 am
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ స‌ర్కార్ గ్రాఫ్ ప‌డిపోతంద‌న్నారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. రాష్ట్రంలో జ‌రిగిన మూడు గ్రాడ్యుయేట్, టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో 2 స్థానాల‌ను త‌మ పార్టీ కైవ‌సం చేసుకోవ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్బంగా ఓటు వేసిన గ్రాడ్యుయేట్స్, టీచ‌ర్ల‌కు, మేధావుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అధికార పార్టీని ఎవ‌రూ న‌మ్మ‌లేద‌ని అన్నారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇవ్వ‌డం, ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం ప‌నిగా పెట్టుకున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ రావ‌డం ఖాయ‌మ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source