జగన్ కు ప్రతిపక్ష నేతహోదా కుదరదు
NEWS Mar 05,2025 03:43 pm
ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం జగన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. అందుకు అసెంబ్లీ రూల్స్ ఒప్పుకోవని వెల్లడించారు. అన్నింటిని పరిశీలించామని తెలిపారు. తాను కోర్టుకు వెళ్లినా చేసేది ఏమీ ఉండదన్నారు. ఇప్పటికే తనకు లేఖ రాశారని, అందులో బెదిరింపు ధోరణితో ఉందన్నారు. కానీ తాను ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తి లేదన్నారు స్పీకర్.