Logo
Download our app
ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు
NEWS   Mar 05,2025 02:58 pm
జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. బుధవారం సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల లో ఏర్పాటుచేసిన ఇంటర్ పరీక్షల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకస్మికతనికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో బుధవారం నుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షల కోసం 54 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source