కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్
NEWS Mar 05,2025 12:11 pm
నల్గొండ జిల్లా నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సైబర్ నేరగాళ్ల నుంచి నగ్న వీడియో కాల్ వచ్చింది సైబర్ నేరగాళ్లు స్క్రీన్ రికార్డింగ్ చేశారు. వీడియోను ఎమ్మెల్యే వీరేశం నంబర్‌కు సైబర్ నేరగాళ్లు పంపారు. డబ్బులు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో వీడియో పెడతామంటూ బెదిరించారు. వాట్సాప్ ద్వారా ఎమ్మెల్యేకు బెదిరింపు సందేశాన్ని సైబర్ నేరగాళ్లు పంపారు. బెదిరింపులపై పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. పోలీసుల సలహాతో సైబర్ నేరగాళ్ల నంబర్‌ను బ్లాక్ చేశారు.