గురుకుల సెక్రటరీకి కోరుట్ల ఎమ్మెల్యే వినతి
NEWS Mar 04,2025 06:08 pm
రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ అలుగు వర్షిణికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వినతిపత్రం సమర్పించారు. కోరుట్ల పట్టణంలో గల బీఏస్సీ ప్రభుత్వ బాలికల వ్యవసాయ కళాశాలని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయానికి అనుబంధం చేయాలని కోరారు. కళాశాలలో భవన సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కళాశాలలో ల్యాబ్ ఏర్పాటు చేయాలన్నారు.