Logo
Download our app
గాంధీ ఆస్ప‌త్రిలో మంత్రి ఆకస్మిక త‌నిఖీ
NEWS   Mar 04,2025 05:02 pm
మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ ఝ‌ల‌క్ ఇచ్చారు. గాంధీ ఆస్ప‌త్రిని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. నేరుగా వార్డుల్లోకి వెళ్లి రోగుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి అందుతున్న సౌక‌ర్యాల ప‌ట్ల ఆరా తీశారు. ఓపీలో ఉన్న పేషంట్స్ తో మాట్లాడారు. వైద్యుల అటెండెన్స్ షీట్ తెప్పించుకుని ప‌రిశీలించారు. ముంద‌స్తు స‌మాచారం లేకుండా విధుల‌కు గైర్హాజ‌రైన డాక్ల‌ర్ల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేక పోవడంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. షోకాజ్ నోటీసులు ఇవ్వాల‌ని, వివ‌ర‌ణ తీసుకోవాల‌ని డీఎంఈకి స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source