అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత
NEWS Mar 04,2025 09:33 am
MBNR: అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం..బాలానగర్ మండలంలోని మాచారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మహేశ్ మాచారం వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా.. నందారం గ్రామ శివారులో పోలీసులు పట్టుకొని సోమవారం పోలీస్ స్టేషన్ కు తరలించారు .యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.