Logo
Download our app
ముగిసిన ఎమ్మెల్సీ తొలి ప్రాధాన్య‌త ఓట్ల లెక్కింపు
NEWS   Mar 03,2025 05:03 pm
న‌ల్ల‌గొండ - ఖ‌మ్మం - వ‌రంగ‌ల్ టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి తొలి ప్రాధాన్య‌త ఓట్ల లెక్కింపు ముగిసింది. 23 వేల 641 ఓట్లు చెల్లుబాటు కాగా 494 ఓట్లు చెల్లుబాటు కాలేదు. గెలుపు కోటా ఓట్లు 11, 822 ఓట్లు రావాల్సి ఉంది. పీఆర్టీయూకు చెందిన శ్రీ‌పాల్ రెడ్డికి 6035 ఓట్లు రాగా, యూటీఎఫ్ నేత న‌ర్సిరెడ్డికి 4,820 కోట్లు, స్వ‌తంత్ర అభ్య‌ర్థి హ‌ర్ష వ‌ర్ద‌న్ రెడ్డికి 4437 ఓట్లు, పూల ర‌వీంద‌ర్ కు 3115 ఓట్లు, బీజేపికి చెందిన పులి న‌రోత్తం రెడ్డికి 2289 ఓట్లు పోల్ అయ్యాయి. గెలుపు కోటా ఓట్లు రాక పోవ‌డంతో 2వ ప్రాధాన్య‌త ఓట్ల‌ను లెక్కిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source