Logo
Download our app
ఎంపీపై కేసు న‌మోదుపై సుప్రీంకోర్టు ఫైర్
NEWS   Mar 03,2025 03:38 pm
కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్ర‌తాప్ గ‌డ్ పై న‌మోదు చేసిన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఎఫ్ఐఆర్ న‌మోదు చేసే ముందు ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించాల‌ని స్ప‌ష్టం చేసింది. త‌న‌కు జ‌రిగిన స‌న్మానానికి సంబంధించి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ క‌విత‌ను షేర్ చేశారు ఎంపీ. దీనిని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇది పూర్తిగా రెచ్చ‌గొట్టేలా ఉంద‌ని, హింస‌ను ప్రేరేపించేలా ఉందంటూ పేర్కొన్నారు. దీనిని స‌వాల్ చేస్తూ హైకోర్టును ఆశ్ర‌యించారు. అక్క‌డ చుక్కెదురు కావ‌డంతో సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టారు.
⚠️ You are not allowed to copy content or view source