పీవీ రమేష్ కామెంట్స్ కలకలం
NEWS Mar 03,2025 02:16 pm
మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పీవీ రమేష్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఎవరైనా సరే భారత రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కొందరు పార్టీలకు వంత పాడుతూ తమను తాము సూపర్ హీరోస్ గా ఫీలవుతూ వచ్చారని ఆరోపించారు. ఆయన నేరుగా మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను ఉద్దేశించి సీరియస్ గా స్పందించారు.