ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలి
NEWS Mar 03,2025 01:27 pm
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లాలోని మామునూరుకు ఎయిర్ పోర్టు మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పోరాటానికి స్పూర్తి దాయకంగా నిలిచిన రాణి రుద్రమ దేవి పేరు ఎయిర్ పోర్ట్ కు పెట్టాలని డిమాండ్ చేశారు కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సర్కార్ పై ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.