చిట్ ఫండ్ ఏజెంట్ ఉరివేసుకొని ఆత్మహత్య
NEWS Mar 01,2025 04:06 pm
అక్షర చిట్ ఫండ్స్ ఏజెంట్ చింతల రాజయ్య అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కరీంనగర్ నగర పరిధిలోని మల్కాపూర్ చింతల రాజయ్య అనే అక్షర చిట్ ఫండ్ ఏజెంట్ గా పనిచేస్తున్నారు.తనకు తెలిసిన కొంత మంది తోటి చిట్ ఫండ్ లో చీటీలు వేయించాడు. ఇటీవల అక్షర చిట్ ఫండ్ ఆస్తులు జప్తు చేయడంతో బాధితులు రాజయ్యను పదేపదే చీటీ డబ్బులు అడగడంతో మనోవేదనకు గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని మృతుడి భార్య లావణ్య తెలిపారు.