Logo
Download our app
క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే గంగుల
NEWS   Feb 28,2025 11:44 pm
వివిధ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభినందించారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ నగరానికి చెందిన షేక్ జియా హుస్సేన్ జూనియర్ మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. హైదరాబాదులో జరిగిన ఆలిండియా కరాటే పోటీల్లో నగరానికి మహమ్మద్ సజ్జద్ బ్లాక్ బెల్ట్ సాధించగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారిని అభినందించి శాలువాతో సత్కరించారు.
⚠️ You are not allowed to copy content or view source