వల్లభనేని వంశీకి భద్రత కరువు
NEWS Feb 28,2025 03:44 pm
ఏపీ సర్కార్ కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ వాపోయింది. తన భర్తను కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఇందుకు సంబంధించిన రిపోర్టులు కూడా కోర్టులో సమర్పించడం జరిగిందన్నారు. బ్యారక్ లో వంశీకి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని మండిపడ్డారు. వంశీని మానసికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.