Logo
Download our app
ఎస్ఎల్బీసీ ఘ‌ట‌న‌పై హ‌రీశ్ సీరియ‌స్
NEWS   Feb 27,2025 06:14 pm
మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. మాజీ మంత్రులు జ‌గ‌దీశ్ రెడ్డి, వి. శ్రీ‌నివాస్ గౌడ్, ల‌క్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల రాజుతో కిల‌సి దోమ‌లపెంట‌కు చేరుకున్నారు. ఎస్ఎల్బీసీ సంఘ‌ట‌న‌కు సంబంధించి ఆరా తీశారు. గెస్ట్ హౌస్ వ‌ద్ద ఉన్న మంత్రుల‌ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్బంగా హ‌రీశ్ రావు ఫైర్ అయ్యారు. తాను ప్ర‌స్తుతం ఎమ్మెల్యేన‌ని త‌న‌కు ప్ర‌శ్నించే హ‌క్కు ఉంద‌ని అన్నారు. గంటల్లో రిపేర్ చేయాల్సిన కన్వేయర్ బెల్ట్ ఆరు రోజులైనా ఎందుకు రిపేర్ చేయలేదని నిల‌దీశారు.
⚠️ You are not allowed to copy content or view source