Logo
Download our app
శైవ క్షేత్రాలు భ‌క్తుల‌తో కిట‌కిట
NEWS   Feb 26,2025 09:10 am
తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలి వస్తున్నారు. శ్రీశైలం, వేములవాడ, కీసరగుట్ట, చెరువుగట్టు వంటి ప్రసిద్ధ ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. భక్తుల సౌకర్యార్థం, రాష్ట్ర ప్రభుత్వాలు, దేవాదాయ శాఖలు విస్తృతమైన ఏర్పాట్లు చేశాయి. మహా శివరాత్రి సందర్భంగా అన్ని శివాలయాల్లో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు ఉపవాస దీక్షలతో స్వామి వారిని దర్శించుకుంటున్నారు. శివ నామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source