Logo
Download our app
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్
NEWS   Feb 25,2025 06:51 pm
27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ అశోక్ పేర్కొన్నారు. మల్లాపూర్ మండల కేంద్రం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 236, 237 బూత్ నంబర్లోని రెండు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎలక్షన్లో ఎలాంటి అవాంతరాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. వారితో మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై రాజు, సిబ్బంది ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source