ఆంధ్రులకు కులం భావన ఎక్కువ
NEWS Feb 25,2025 06:05 pm
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శాసన సభలో తెలంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ భావన ఉంటుందని కానీ ఆంధ్ర ప్రజలకు మాత్రం కేవలం కులం భావన మాత్రమే ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ భావనను మనం తగ్గించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ వారిని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.