ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
NEWS Feb 25,2025 04:29 pm
మల్లాపూర్ కనక సోమేశ్వరస్వామి జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. జాతరకు పెద్దఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.