Logo
Download our app
ఏనుగుల దాడి ఘ‌ట‌న బాధాక‌రం
NEWS   Feb 25,2025 10:29 am
అన్న‌మ‌య్య జిల్లాలో ఏనుగుల దాడిలో శివ స్వాములు మృతి చెంద‌డం ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ఈ సంద‌ర్బంగా ఎస్పీ వి. విద్యా సాగ‌ర్ తో ఫోన్ లో మాట్లాడారు. వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య సౌక‌ర్యం అందించాల‌ని ఆదేశించారు. బాధిత కుటుంబాల‌కు ప్రభుత్వం అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ఓబులవారిపల్లి మండలం వై కోట సమీపంలోని గుండాల కోనలో ఉన్న ఈశ్వరుడి దర్శనానికి వెళ్లే భక్తులకు మరింత భద్రత ఏర్పాట్లు చేయాలని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source