ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్
NEWS Feb 25,2025 09:08 am
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29వ నాటితో ముగియనుంది. ఐదుగురిలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా హసన్ ఉన్నారు. దీంతో షెడ్యూల్ ను ప్రకటించింది.