ఏనుగుల దాడిలో భక్తులు మృతి
NEWS Feb 25,2025 09:03 am
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై దాడి చేశాయి. ముగ్గురు భక్తులు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. వారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళ్తుండగా ఏనుగులు దాడి చేశాయి. అటవీ అధికారులు ఘటనపై ఆరా తీస్తున్నారు.