Logo
Download our app
అమ్జెన్ సెంట‌ర్ రావ‌డం సంతోషం
NEWS   Feb 24,2025 06:56 pm
సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్ లో ప్ర‌ముఖ ప్ర‌పంచ దిగ్గ‌జ సంస్థ అమ్జెన్ సంస్థ రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. గత ఏడాది ఆగస్టులో శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లినప్పుడు అమ్జెన్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను సందర్శించాన‌ని చెప్పారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్నాలజీకి హబ్ గా ఉన్న త‌మ‌తో భాగ‌స్వామ్యం కావాల‌ని కోర‌డం జ‌రిగిందన్నారు రేవంత్ రెడ్డి. త‌న పిలుపున‌కు స్పందించిన అమ్జెన్ సంస్థ ఇన్నోవేష‌న్ సెంట‌ర్ ను ఇవాళ న‌గ‌రంలో ప్రారంభించ‌డం మ‌రిచి పోలేన‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source