టన్నెల్ ను పరిశీలించిన మంత్రి
NEWS Feb 24,2025 06:04 pm
NGKL: అచ్చంపేట మండలంలోని దోమల పెంట వద్ద SLBC టన్నెల్ ప్రమాద స్థలాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. ఆయనకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ స్వాగతం పలికారు. మంత్రి బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.