ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కక్ష కట్టారు
NEWS Feb 24,2025 02:06 pm
వైసీపీ బాస్ జగన్ నిప్పులు చెరిగారు. ఏపీ కూటమి సర్కార్ కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఎన్ని కేసులు నమోదు చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వ అసమర్థత గురించి ప్రజలకు వివరిస్తామన్నారు జగన్ .