Logo
Download our app
దొంగల బీభత్సం..15 తులాల బంగారం చోరీ
NEWS   Feb 24,2025 01:28 pm
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు భీభత్సం సృష్టించారు. పట్టణంలోని పద్మా న‌గ‌ర్ కు చెందిన గుండేటి రాజశేఖర్ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్ళగా సోమవారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంట్లో దుండగులు చొరబడి 15 తులాల బంగారం, రూ.15 వేల నగదు దోచుకెళ్లారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source