Logo
Download our app
తిరుచ్చిపై సోమస్కంద మూర్తి క‌టాక్షం
NEWS   Feb 23,2025 01:45 pm
తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఆదివారం శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమ స్కంద మూర్తి తిరుచ్చిపై క‌టాక్షించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పుర వీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు
⚠️ You are not allowed to copy content or view source