Logo
Download our app
ఘ‌నంగా శ్రీనివాసుడి గరుడ సేవ
NEWS   Feb 23,2025 01:35 pm
తిరుప‌తిలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. శ్రీ‌నివాసుడి గ‌రుడ వాహ‌న సేవ ఘ‌నంగా జ‌రిగింది. స్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
⚠️ You are not allowed to copy content or view source