బాధితురాలు సలీమాకు సీఎం భరోసా
NEWS Feb 23,2025 09:01 am
కాలిన గాయాలతో లేవలేని స్థితిలో మంచానికే పరిమితమైన సలీమా ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తక్షణమే ఆమెకు తగిన వైద్య సహాయం అందించడంతో పాటు దివ్యాంగుల పింఛను ఏర్పాటు చేయాలని స్పష్‌టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. భోజన సదుపాయం కల్పించాలన్నారు.