శ్రీశైలం పోటెత్తిన భక్తజనం
NEWS Feb 23,2025 08:38 am
పుణ్య క్షేత్రం శ్రీశైలం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. మహా శివరాత్రి సందర్బంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. శివ నామ స్మరణతో శ్రీశైలం దద్దరిల్లుతోంది. ఉత్సవాల సందర్బంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్లకు కాణికాపం దేవస్థానం తరపున ఈవో పెంచల కిషోర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి ఏటా టీటీడీ నుంచి వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.