కుక్కల బెడదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
NEWS Feb 22,2025 08:16 pm
MBNR: బాలానగర్ మండల కేంద్రంలో ప్రతి వీధిలోనూ కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని మండల కేంద్రం ప్రజలు అన్నారు. కుక్కల బెడదతో చిన్నపిల్లలను షాపు వద్దకు.. పాఠశాలలకు పంపించాలంటే ఇబ్బందులు పడుతున్నామన్నారు. రెండు నెలల క్రితం లేగ దూడపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఉన్నతాధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించాలని మండల కేంద్రం ప్రజలు కోరారు.