Logo
Download our app
ఆదుకోండి మహాప్రభో అంటున్న రైతు
NEWS   Feb 22,2025 08:17 pm
ములుగు జిల్లా ములుగు మండలం పొట్లాపూర్ గ్రామంలో ని పాలడుగుల సమ్మయ్య అనే రైతు ఆరు ఎకరాల మొక్కజొన్న పంటపై అడవి పందులు భీభత్సం సృష్టించాయి. చేతికొచ్చిన పంట పందుల పాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని తన గోడు వెళ్లబోసుకున్నాడు. లేదంటే తనకు ఆత్మహత్యే శరణ్యం అని రైతు సమ్మయ్య అన్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source