Logo
Download our app
గ్రూప్-2 మెయిన్స్ ప‌రీక్ష వాయిదా
NEWS   Feb 22,2025 03:22 pm
ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈనెల 23న ఆదివారం జ‌ర‌గాల్సిన గ్రూప్-2 మెయిన్స్ ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని ఏపీపీఎస్సీని ఆదేశించింది. రోస్ట‌ర్ విధానంలో లోపాలు ఉన్నాయంటూ గ‌త కొన్ని రోజులుగా అభ్య‌ర్థులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. రోస్ట‌ర్ అంశంపై కోర్టులో ఉన్న పిటిష‌న్ విచార‌ణ మార్చి 11న జ‌ర‌గ‌నుంది. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడాల‌ని స‌ర్కార్ భావిస్తోంది. ఈ మేర‌కు అభ్య‌ర్థుల విన్న‌పాల‌ను ప‌ర‌గణ‌లోకి తీసుకుంది స‌ర్కార్.
⚠️ You are not allowed to copy content or view source