Logo
Download our app
ఎస్ఎల్బీసీ ట‌న్నెల్ ప్రమాదంపై సీఎం ఆరా
NEWS   Feb 22,2025 03:01 pm
న‌ల్ల‌గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ ట‌న్నెల్ వ్ద‌ద ప్ర‌మాదం చోటు చేసుకుంది. మూడు మీట‌ర్ల మేర పైక‌ప్పు కూలి పోయింది. ఎడ‌మ వైపు సొరంగం 14వ కిలోమీట‌ర్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. నాలుగు రోజుల కింద‌టే ఈ ట‌న్నెల్ ప‌నులు ప్రారంభం అయ్యాయి. ఇవాళ ప‌నులు కొన‌సాగుతుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం.
⚠️ You are not allowed to copy content or view source