Logo
Download our app
అమ్మకు ఏమీ కాలేద‌న్న చిరంజీవి
NEWS   Feb 22,2025 09:07 am
త‌న త‌ల్లి అంజ‌నాదేవి ఆరోగ్యం గురించి స్పందించారు ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి. తన త‌ల్లికి బాగోలేదని, ఆస్ప‌త్రిలో చేర్పించామంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌ర‌గ‌డం ప‌ట్ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎప్ప‌టి లాగే జ‌న‌ర‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, ఆమె ఆరోగ్యం ప్ర‌స్తుతం ప‌దిలంగానే ఉంద‌ని, ఎలాంటి ఇబ్బంది అంటూ లేద‌ని స్ప‌ష్టం చేశారు. మెగా అభిమానులు ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని ఈ సంద‌ర్బంగా చిరంజీవి కోరారు.
⚠️ You are not allowed to copy content or view source