Logo
Download our app
హంస వాహనం పై విహరించిన శ్రీశైలేశుడు
NEWS   Feb 22,2025 08:17 am
మ‌హా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు శ్రీ‌శైలంలో అంగ రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. మూడో రోజు శ్రీ మ‌ల్లికార్జున స్వామి, శ్రీ భ్ర‌మ‌రాంబికా అమ్మ వార్ల‌కు పూజ‌లు నిర్వ‌హించారు. లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు జరిపించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం తరుపున స్వామి , అమ్మ వార్ల‌కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. దేవ‌స్థానం ఈవో ఎం. శ్రీ‌నివాస రావు దంప‌తులు, వేద పండితులు ప్ర‌త్యేక పూజ‌లు చేప‌ట్టారు.
⚠️ You are not allowed to copy content or view source